అక్కినేని నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా ఈ 2022 సంక్రాంతికి విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర పెద్దఎత్తున కలెక్షన్లు సాధించింది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ గా బంగ్రాజు సినిమా నిలిచింది. బంగార్రాజు సినిమాతో పాటుగా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకి అంత పాజిటివ్ టాక్ రాలేదు. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ "బంగార్రాజు" సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రాబోయే రెండు వారాల్లో పెద్ద సినిమాలా రిలీజ్ కానందున బంగార్రాజు సినిమా కలెక్షన్స్ ఫుల్ రన్లో కొనసగుతుంది అని భవిస్తున్నారు. ఈరోజు రాజమండ్రిలో బంగార్రాజు సక్సెస్ మీట్ జరగనుంది. నాగార్జున,నాగ చైతన్య,బంగార్రాజు మూవీ టీమ్ అంతా ఈ మీటింగ్ కి హాజరు అవుతున్నారు.