ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తింట్లోకి పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 12:51 PM



 ప్ర‌తి ఒక్క‌రికి సొంతింటి క‌ల అనేది తప్ప‌క ఉంటుంది. జీవితంలో ఒక‌సారైన ఆక‌ల‌ని నెర‌వేర్చుకోవాల‌ని ఎంత‌గానో ఆశ‌ప‌డుతుంటారు. అయితే చిన్న వాళ్ల‌కే కాదు పెద్ద పెద్ద సెల‌బ్రిటీల‌కు కూడా ఈ క‌ల క‌ల‌గానే మిగిలిపోతుంది. తాజాగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే త‌న క‌ల‌ని నెర‌వేర్చుకుంది. పూజా తన కొత్తింట్లోకి అడుగుపెట్టింది. ముంబయిలో పూజా హెగ్డే ఓ ఇంటిని నిర్మించుకుంది. తాజాగా శుక్రవారం తన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసినట్టు పేర్కొంది.ఈ సందర్భంగా తాను పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఏడాది పాటు ఈ కొత్తింటి నిర్మాణం జరిగిందని, అన్ని కలలు నెరవేరినందుకు మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పనిచేయండి అని పేర్కొంది. కష్టపడి పనిచేస్తే ఈ విశ్వం కచ్చితంగా మీ హృదయంతో ప్రేమలో పడుతుందని, మీ డ్రీమ్స్ పుల్‌ఫిల్‌ అవుతాయనే సందేశాన్నిచ్చింది. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు, ఆమె అభిమానులు పూజాకి అభినందనలు తెలియజేస్తున్నారు.


ఇక తాను పూజాలో పాల్గొన్న ఫోటోని పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. ట్రెడిషనల్‌ లుక్‌లో పూజా అందం రెట్టింపు కాగా, ఆద్యంతం కట్టిపడేస్తుంది. పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com