ట్రెండింగ్
Epaper    English

మంచుకొండల్లో సమంత

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 01:44 PM



పుష్ప చిత్రంలో ఊ అంటావా ఊఊ అంటావా ఐటం సాంగ్ తో ఉర్రూతలూగించిన సమంతా, ప్రస్తుతం విహారయాత్రలో ఉంది. షూటింగ్ విరామంలో యూరప్ వెళ్లిన సమంత స్విట్జర్లాండ్ మంచుకొండల్లో స్కీయింగ్ చేస్తోంది. వెర్బియర్ ప్రాంతంలో స్కీయింగ్ దుస్తుల్లో ఉన్న ఫొటోను సామ్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. స్కీయింగ్ చేయడం ఏమంత సులువు కాదని, అయితే ఎంతో సరదాగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' చిత్రంలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న 'యశోద' చిత్రం కూడా సెట్స్ పై ఉంది. అటు సమంత పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో సమంత పెర్ఫార్మెన్స్ బాలీవుడ్ ఫిలింమేకర్స్ ను కూడా ఆకట్టుకుంది.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com