ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 28న ‘గుడ్‌ లక్‌ సఖి’

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 02:37 PM



జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గుడ్‌ లక్‌ సఖి’. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం రూపొందింది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్‌ ప్రకటించింది. జనవరి 28న విడుదల కానుంది. ఇక ‘గుడ్‌ లక్‌ సఖి’ సినిమా సోలోగా ప్రేక్షకుల ముందుకురానుంది. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించగా, చిరంతాన్‌ దాస్‌ సినిమాటోగ్రర్‌గా బాధ్యతలు నిర్వహించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com