ట్రెండింగ్
Epaper    English

హీరో నాని చిత్రంలో మలయాళ నటుడు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 08:01 PMసినిమా హిట్ కావాలంటే అందులో నటించే నటీనటులు కూడా ముఖ్యమే. నాని హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'అంటే .. సుందరానికీ' చేస్తున్నాడు. ఈ సినిమాతో కథానాయికగా నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆ తరువాత సినిమాగా నాని 'దసరా'ను లైన్లో పెట్టేశాడు .. .. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలంగాణలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలోనే మాట్లాడతాడట. అందుకోసం ఆయన ట్యూటర్ ను పెట్టి నేర్చుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసే ఆలోచన ఉందని అంటున్నారు. అందువల్లనే మలయాళానికి చెందిన యువ నటుడు రోషన్ మాథ్యూ ని ఒక కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సాయికుమార్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com