మృణాళిని రవి బ్లాక్ బస్టర్ భామ. 'సూపర్ డీలక్స్' సినిమాతో తమిళ తెరకు పరిచయం అయింది. ఇందులో సపోర్టింగ్ రోల్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'గద్దలకొండ గణేష్'తో తెలుగు తెరకు పరిచయం అయింది. బుజ్జమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. తమిళ్, తెలుగులోనూ ఈ బ్యూటీకి సూపర్ ఎంట్రీ లభించింది. అందుకే బ్లాక్ బస్టర్ భామగా పిలిపించుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు.
కానీ తమిళ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం కోబ్రా సినిమాలో నటిస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్ | ఫోటోలతో సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. తెలుగులోనూ ఓ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది.. మృణాళిని.