ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"హృదయం" టాలీవుడ్ మేకర్స్‌ని ఆకర్షిస్తుందా???

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 03:34 PM



2022 మలయాళంలో మొదటి సూపర్ హిట్ చిత్రంగా "హృదయం"  పేరు సాదించుకుంది.ఈ సినిమా శుక్రవారం విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూలు పొందుతోంది.వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన "హృదయం" చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్‌బస్టర్ గా నిలిచి సినిమా విడుదల కి ముందే సినిమా పై భారీ  అంచనలు సృష్టించింది."హృదయం"  సినిమా  దాదాపు బాక్సాఫీస్ వద్ద 3 కోట్లు వసూలు చేసింది అని వెళ్ళడించారు.తెలుగు నిర్మాతలు ఈ మధ్యకాలంలో మలయాళ చిత్రాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కప్పెల, నాయట్టు, అయ్యప్పనుమ్ కోషియుమ్ వంటి సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి.ఇప్పుడు "హృదయం"  సినిమా కూడా తెలుగు రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని భావిస్తున్నారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com