"ఉప్పెన" సినిమాతో హీరో గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్ టైటిల్ ని మూవీ మేకర్స్ "రంగా రంగ వైభవంగా" అని కరారు చేసారు.టైటిల్ తో పాటుగా ఒక వీడియో ని కూడా రిలీజ్ చేసారు ఈ సినిమా టీమ్.వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ బటర్‌ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొమాంటిక్ వే లో ఈ వీడియో ఉంది.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం వీడియోకి మరింత హైప్‌ని క్రియేట్ చేసింది అని భవిస్తున్నారు.అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించారు.