హెల్పింగ్ స్టార్ సోనూసూద్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ప్రజలకు సాయం చేయడం తమ కుటుంబ రక్తంలోనే ఉందని ఆయన అన్నారు. అయితే రాజకీయాల్లోకి ఇప్పుడే రాలేనని అన్నారు. మరో ఐదు సంవత్సరాల పాటు ప్రజా సేవ చేసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతానని తెలిపారు. కాగా సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.