శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా 'భల తందానా'.ఈ సినిమాలో కేథరిన్ త్రెసా, కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామచంద్రరాజు ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు.తాజగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 28న ఉదయం 10.24 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు.ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.ఈ సినిమాని వారాహి చలనచిత్రం బ్యానర్ నిర్మించింది.