నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఆన్ లైన్ క్లాస్ లో ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్ సింగరాయ్ గా మార్చుకున్నాడు. దీంతో ఇది నిజంగా మీ పేరా? లేక సినిమా పేరును పెట్టుకున్నారా? అని లెక్చరర్ అడిగారు. దీనికి విద్యార్థి బదులిస్తూ అది తన పేరేనని, తన భార్య రోజీ సింగరాయ్ కూడా క్లాస్ లోనే ఉందని అన్నాడు. తమని కలిపే బాధ్యత లెక్చరర్ దేనని అన్నాడు. అయితే దీనిని కావాలనే క్రియేట్ చేశారా? నిజంగానే జరిగిందా? అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.