మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతుంటుంది. ఫ్యాషన్ ఐకాన్ గా పిలిపించుకుంటుంది. గురువారం ముంబై ఎయిర్ పోర్ట్ లో తమ్మూ వెంట బాలీవుడ్ కెమెరాలు వెంట పడ్డాయి. క్లిక్.. క్లిక్.. అనిపించాయి. ఆ ఫోటోలు చూసి బాలీవుడ్ భామలు సైతం కుళ్లుకునేలా ఉన్నాయి. గ్రీన్ కలర్ స్పోర్ట్స్ డ్రా, దానిపై ఆరేంజ్ కలర్ స్వెటర్, నడుము అందాలు కనిపిస్తూనే.. కింద చిరిగిన జీన్స్ ప్యాంట్.. తమ్మూ డ్రెస్సింగ్ స్టైల్ అదిరిపోయింది. అందుకే ఆమె ఫోటోలు ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ప్రస్తుతం తమన్నా ఎఫ్ 3 సినిమాతో పాటు బోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. 'గని' సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరవనుంది.