మల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం DJ టిల్లు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న లేదా 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ యొక్క విభిన్న పాత్ర మరియు విలక్షణమైన హైదరాబాదీ యాస ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. కథానాయికగా నటించిన నేహా శెట్టి టీజర్ తో పాటు పాటల్లోనూ గ్లామరస్‌గా కనిపించింది.