ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య...?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 12:34 PM



నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్"  షో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. బాలయ్య లోని కోపం మాత్రమే కాదు ఈ షో ద్వార ఆయనలో ఉన్నా ఫన్నీ మరియు నాటీ యాంగిల్ ని కూడా ప్రేక్షకులు చూశారు. ఆయన హోస్టింగ్ స్టైల్ మరియు కామెడీ టైమింగ్ షో ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పొచ్చు. మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రవితేజ, నేచురల్ స్టార్ నాని, SS రాజమౌళి,  MM కీరవాణి, సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రానా దగ్గుబాటి  సీజన్ 1లో అతిధులుగా వచారు ఫైనల్ ఎపిసోడ్ కి మహేష్ బాలయ్య తో కనిపించనున్నారు. సీజన్ 1లో ఓక ఎపోసైడ్ కి బాలయ్య 40 లక్షలు ఛార్జ్ చేసాడు , టోటల్ గా బాలయ్య ఈ షో ద్వారా 5 కోట్లు సంపాదించారు. ఇటీవల  తాజాగా IMDb యొక్క ప్రపంచంలోని టాప్ 50 టాక్ షోల జాబితాలో 18వ స్థానంలో నిలిచి అరుదైన ఘనతను సాధించింది. సీజన్ 2 కి కూడా బాలకృష్ణ నే హోస్ట్ చేయమని ఆహా టీమ్ అడుగుతే  బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సెకండ్ సీజన్ కోసం బాలయ్య బాబు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండగా సీజన్ 2 కి ఎక్కువ పారితోషికం ఇవ్వనున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com