సంపత్ నంది దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం సీటీమార్. గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్గా నటిస్తుండగా, దిగంగనా సూర్యవంశీ, భూమిక చావ్లా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్గా ప్రదర్శించబడుతుంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్గా జెమినీ టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.