జి. సూర్యతేజ దర్శకత్వంలో సుహాసిని,భానుచందర్, విజయ్ శంకర్ మరియు ఆశు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫోకస్'.ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇంతకుముందు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, వాలెంటైన్స్ డే రోజు విడుదల చేసిన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ స్పెషల్ లుక్ పోస్టర్ను సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.