జూన్ 1వ తేదీన 'రాజుగాడు' విడుదల

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 04:18 PM
 

రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'రాజుగాడు' సినిమా రూపొందింది. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది. తనకి తెలియకుండానే చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక వింత వ్యాధి లక్షణం కలిగినవాడిగా రాజ్ తరుణ్ ఈ సినిమాలో కనిపిస్తాడట. అతనికి గల ఈ వ్యాధి కారణంగా ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది.


ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా కొనసాగుతుందట. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడట.    


 


 
Recent Post