తమ్ముడి సవాలు స్వీకరించిన చైతూ

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 04:36 PM
 

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పుషప్స్ తీస్తూ వీడియోను తీసుకుని ట్వీట్ చేస్తూ ముగ్గురికి 'ఫిట్ నెస్' చాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫిట్‌నెస్‌ సవాలు వీడియోలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సవాలు విసిరిన వారిలో హైదరాబాదీ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఉన్నారు. ఆమె వ్యాయామం చేసి పీవీ సింధూతో పాటు మరో ఇద్దరికి సవాలు విసిరింది.


పీవీ సింధు కూడా ఈ సవాలు స్వీకరించి అక్కినేని అఖిల్‌ తో పాటు మరో ఇద్దరికి చాలెంజ్‌ చేయగా.. అఖిల్‌ నిన్న జిమ్‌లో వ్యాయామం చేసి పలువురికి సవాలు విసిరాడు. వారిలో అక్కినేని నాగచైతన్య కూడా ఉన్నారు. నాగచైతన్య ఈ రోజు జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ పుషప్స్ తో పాటు పలు రకాల వ్యాయామాలు చేస్తూ 52 సెకన్ల వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి తన శ్రీమతి సమంతతో పాటు సినీనటులు సుశాంత్‌, నిధి అగర్వాల్‌కి ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ విసిరాడు. మరి శ్రీవారి చాలెంజ్‌ను సమంత స్వీకరించి, ఎవరెవరికి సవాలు విసురుతుందో చూడాలి. మొత్తానికి ఈ చాలెంజ్‌ పిట్‌నెస్‌ దేశ ప్రజలకు అవగాహన కల్పించేలా ఉంది. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సెలబ్రిటీలు సూచిస్తున్నారు.
Recent Post