టాలీవుడ్ పై షాలినీ క‌న్ను

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 04:39 PM
 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మణిరత్నం క్లాసిక్ మూవీ అంజలి సినిమాలో ఒక చిన్నారి పాత్రలో షామిలి అంద‌ర్ని ఆక‌ట్టుకుంది..ఇక 2009లో ఓయ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఆ మూవీలో ఆమె అంత‌గా టాలీవుడ్ జ‌నాల‌ను ఆక‌ట్టుకోలేదు..దీంతో ఆరేళ్లు గ్యాప్ ఇచ్చి మ‌ల‌యాళం మూవీ వ‌లియం తెట్టి, పులియం తెట్టి లో న‌టించింది.. అయినా బ్రేక్ రాలేదు..ఇక 2016లో త‌మిళ మూవీ వీర శివాజీలో న‌టించినా పెద్ద మార్పు రాలేదు.. దీంతో ఆమె సోద‌రి షాలినీని వివాహం చేసుకున్న త‌మిళ స్టార్ హీరో అజిత్ మ‌ర‌ద‌లి కెరీర్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టాడు.. అత‌డే స్వ‌యంగా ఆమెను ఫోటో షూట్ చేసి, న‌ట‌న ప‌రంగా కొత్త శిక్ష‌ణ ఇచ్చాడు.. దీంతో నాగ‌శౌర్య మూవీ అమ్మ‌మ్మ‌గారి ఇల్లు మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ద‌క్కించుకుంది.. ఈ మూవీ రేపే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలొస్తాయ‌నే ఆశ‌తో షామిలి ఉంది.. ఇప్ప‌టికే 30 ప్ల‌స్ లోకి వ‌చ్చేసిన షామిలీ ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ ను ఏ విధంగా ఛాన్స్ లు ద‌క్కించుకుంటుందో చూడాలి మ‌రి
Recent Post