రజనీకాంత్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కాలా. ముంబై బ్యాక్ డ్రాప్లో పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూన్ 7న విడుదల కానున్న ఈ చిత్రం మే 29 సాయంత్రం 6గం.లకి హైదరాబాద్లోని నోవాటెల్లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ మూవీకి సంబంధించిన పాత్రలని పరిచయం చేస్తూ వస్తున్నారు. తాజాగా కాలాలో కీలక పాత్ర పోషించిన హుమా ఖురేషీ లుక్ విడుదల చేశారు. హుమా ఖురేషీ 45 ఏళ్ళ జరీనా అనే పాత్రలో కనిపించనుందట. కబాలి చిత్రంలో రాధిక ఆప్టే పాత్ర ఎలా ఉంటుందో కాలాలో హుమా ఖురేషీ పాత్ర కూడా అలానే ఉంటుందని అంటున్నారు. నానా పటేకర్ .. హరి దాదా అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక రజనీకాంత్ గ్యాంగ్స్టర్గా కనిపంచనుండగా ఆయన భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటించారు. సముద్ర ఖని, హిందీ నటి అంజలి పాటిల్ కూడా చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. కాలా సినిమా హిందీలోను విడుదల కానుండగా, ఆ వర్షెన్కి కింగ్ ఆఫ్ దార్వి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.