ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ పై బాపు బొమ్మ ఆశలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 12, 2018, 12:30 PM



హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టపడాలి. కొన్ని సార్లు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో మిస్ అవుతాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఒక ఏడాదిలో వందల మంది హీరోయిన్స్ పరిచయం అవుతున్నారు. కానీ అందులో స్టార్ హీరోయిన్స్ అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. గత కొంత కాలంగా హీరోయిన్ గానే కాకుండా సైడ్ హీరోయిన్ గా కూడా తన క్రేజ్ పెంచుకోవాలని చూస్తోంది బెంగుళూర్ బ్యూటీ.. బాపు బొమ్మ ప్రణీత. 


అమ్మడు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది గాని సరైన గుర్తింపు దక్కలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ముందుగా ఒక సాంగ్ లో కనిపించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకుంది. ఆయుష్మాన్ మెయిన్ రోల్ లో వస్తున్న ఆ సాంగ్ కు చేయిన్ ఖిత్తన్ అని టైటిల్ సెట్ చేశారు. రోచక్ కోహ్లీ కంపోజ్ చేసిన ఆ సాంగ్ ని సురేష్ త్రిపాఠీ డైరెక్ట్ చేయనున్నారు. ఇకపోతే ప్రణీత ఈ సాంగ్ లో సరికొత్తగా కనిపిస్తుందట. 


అయితే ఇదే తరహాలో గతంలో ఒక బెంగుళూర్ బ్యూటీ బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె ఎవరో కాదు కృతి ఖర్బందా. ఆమె గ్లామర్ డోస్ బాగానే పెంచినా అనుకున్నంత రేంజ్ లో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ప్రయత్నాలు చేసుకోవడానికి ఒక రూట్ అయితే దొరికింది. మరి ప్రణీత ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com