నాగార్జున కొత్త లుక్ పై అనుమానాలు ?

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 02:04 PM
 

నాగార్జునకు సంబందించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భుజాలపై టవల్ వేసుకొని.. గుండ్రని కళ్లజోడు ధరించి తెల్లగడ్డంతో కనిపిస్తున్నాడు నాగార్జున. ఈయన పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. అచ్చం పల్లెటూరు తాతలా డిఫెరెంట్ లుక్‌లో నాగార్జునను చూసి మురిపోతున్నారు నెటిజన్లు. వెండితెరపై ఎలాంటి వేషం వేయాలన్నా అది నాగార్జునకే సాధ్యం అని చెప్పుకుంటున్నారు. 


ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇంతకీ ఈ లుక్ ఏ సినిమా లోనిది అనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అయితే కొందరు మాత్రం నాగ్ కొత్తగా చేస్తున్న మల్టీస్టారర్ సినిమా లోనిదే ఈ లుక్ అంటున్నారు. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ‘దేవదాస్’ అనే పేరుతో ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 


ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగ్ పిక్ కూడా అందులోదే అయితే మాత్రం సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. ఎందుకంటే ఇటీవలే ‘సోగ్గాడే చిన్నినాయనా’లో పల్లెటూరు పడుచులతో చిందేసి తన ఎనర్జీ ఇలాంటిదని నిరూపించిన నాగ్.. ఈ తెల్లగడ్డం గెటప్‌లో ఇంకేం చేస్తాడా? అనే కుతూహలం ప్రేక్షకుల్లో ఉంటుంది. అయితే ఈ పిక్ ‘దేవదాస్’ లోనిదా.. కాదా..? అనేది మాత్రం చిత్రయూనిట్ అఫీషియల్‌గా చెబితే గానీ క్లారిటీ ఇవ్వలేం.
Recent Post