రష్మీగౌతమ్,జై ల అంతకుమించి ట్రైలర్‌ విడుదల

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 02:59 PM
 

జై, రష్మీగౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంతకుమించి. జానీ దర్శకుడు. సతీష్‌గాజుల, ఏ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సినిమా చూడాలనే ఉత్కంఠను కలిగిస్తున్నది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి అని పేర్కొన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ హారర్ అంశాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఓ ప్రేమజంటకు ఎదురైన అనూహ్య మలుపులతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటిస్తాం అని తెలిపారు. దర్శకుడిగా తన తొలి చిత్రమిదని, గతంలో తెలుగు తెరపై వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఉంటుందని, ట్రైలర్‌ను సుకుమార్ విడుదలచేయడం ఆనందంగా ఉందని జానీ చెప్పారు. ఈ సినిమాలో తాను మధ్యతరగతి యువకుడి పాత్రలో కనిపిస్తానని, తన పాత్ర చిత్రణ సహజంగా ఉంటుందని హీరో జై చెప్పారు. సూర్య, మధునందన్, రవిప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా:బాల్‌రెడ్డి.
Recent Post