​పాపం సాయి ధరమ్ "తేజ్ "

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 03:25 PM
 

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్  పేరులో తప్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఉత్తేజం లేకుండా పోయింది. తేజ్ ఐ లవ్ విజయవంతంగా డిజాస్టర్ డబల్ హ్యాట్రిక్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగా తేజు ప్రత్యేకంగా అభిమానించే ఫాన్స్ కూడా ఇకపై అతని కథల ఎంపిక అనుమాన పడేలా చేస్తోంది. మొదటి మూడు రోజులు వీక్ ఎండ్ కాబట్టి ఏదోలా లాగేస్తుంది అనుకున్నా బిసి సెంటర్ ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిప్పికొట్టడంతో చాలా చోట్ల ఫుల్స్ రికార్డు కాలేదు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటె ముందు నుంచే అమెరికాలో సరైన మార్కెట్ లేని తేజు ఇప్పుడు దీని ద్వారా మరో అప్రతిష్ట మూటకట్టుకున్నాడు. వీక్ ఎండ్ వరకు కలిపి మొత్తం ఓ 70 వేల డాలర్లు కూడా వసూలు చేయలేక తేజ్ ఐ లవ్ చతికిలబడింది.ఎమోషనల్ గా అనిపించే ప్రేమకథలకు మంచి ఆదరణ ఉండే ఓవర్ సీస్ మార్కెట్ పై కరుణాకరన్ తో పాటు తేజు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవి పూర్తిగా నీరుగారి పోయాయి. ఈ రోజు నుంచి విపరీతమైన డ్రాప్ ఉన్న నేపధ్యంలో సేఫ్ గా బయట పడటం అసాధ్యం. మూడు నెలల క్రితం వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ ఈజీగా మిలియన్ మార్క్ అందుకుంది. 


అందరు హీరోలకు ఏదో ఒక రూపంలో ఒక మిలియన్ డాలర్ మూవీ ఉండటం అవసరమైన నేపధ్యంలో తేజు కనీసం లక్ష డాలర్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇకపై తేజు కొత్త సినిమాను మార్కెట్ చేయాలన్నా కష్టంగా ఉండేలా ఉంది. తేజ్ ఐ లవ్ ఎంత లేదన్నా 60 శాతం దాకా నష్టాలతో క్లోజ్ అయ్యేలా ఉందని ట్రేడ్ అంచనా. ఇప్పటి దాకా ఐదు కోట్ల షేర్ కూడా దాటలేదు. పెట్టుబడి సేఫ్ గా వచ్చింది అని చెప్పాలన్నా 15 కోట్ల దాకా కలెక్షన్లు కనిపించాలి. కానీ ఈ టాక్ తో అది అసాధ్యం. ఈ వారం  వచ్చే కొత్త రిలీజులతో తేజ్ ఐ లవ్ యుని ఓవర్ సీస్ తో పాటు చాలా సెంటర్స్ లో లిఫ్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. కెరీర్ మొదట్లో  ఉత్తేజంతో తొణికిసలాడిన సాయి ధరమ్ తేజ్ ని  ఈ సిట్యువేషన్  చాలా ఇబ్బంది పెడుతోంది. తేజ్ ఐ లవ్ యు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లో ఎంత గొప్పగా చెప్పుకున్నా బయట ఫలితం  నిజాలు బయట పెట్టేస్తోంది కనక అది కూడా మొక్కుబడి తతంగంగా మారిపోయింది. 


 
Recent Post