ఛలో హీరోయిన్ కి కాబోయేది ఇతడే

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 04:04 PM
 


తొలి చిత్రం ‘ఛలో’తోనే చూసీ చూడంగానే నచ్చేశావే అనిపించుకుంది రశ్మికా మండన్న. తెలుగులో విజయ్‌ దేవరకొండతో ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, నానితో ‘దేవదాస్‌’ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం కన్నడ చిత్రం ‘వృత్ర’ షూటింగ్‌లో బెంగుళూరులో బిజీగా ఉంది రశ్మిక. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇంతకు ముందే నిశ్చితార్థం అయిందనే విషయం తెలిసిందే.

 

నిశ్చితార్థం గురించి అయితే తెలుసు కానీ.. ఆమెకు కాబోయే వరుడు ఎవరో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. దీంతో ఆమెకు కాబోయే రాకుమారుడు ఎవరా? అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రశ్మికకు కాబోయే వరుడి పేరు రక్షిత్ శెట్టి. కర్ణాటకకు చెందిన రక్షిత్ నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. వీళ్లిద్దరూ 2016లో కన్నడలో కిరాక్ పార్టీ(2016) సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా నుంచి వారి లవ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది.

Recent Post