కాజల్‌తో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 04:41 PM
 

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త సినిమా షురూ అయ్యింది. కాజల్‌ ఇందులో ఆయనకు జోడీగా నటించనున్నారు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.


సోమవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్‌, శ్రీవాస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వినాయక్‌ క్లాప్‌ కొట్టగా, శ్రీవాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను బెల్లంకొండ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వినాయక్‌, శ్రీవాస్‌కు ధన్యవాదాలు చెప్పారు. చాలా ఉత్సుకతగా ఉందని పేర్కొన్నారు.


బెల్లంకొండ నటించిన ‘సాక్ష్యం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్‌ దర్శకుడు. శనివారం రాత్రి విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కాజల్‌ ప్రస్తుతం ‘క్వీన్‌’ తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో నటిస్తున్నారు. మరోపక్క ఆమె సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలోనూ నటించనున్నారు. ఇందులో రవితేజ కథానాయకుడు. కేథరిన్‌ మరో హీరోయిన్ .
Recent Post