సదా సినిమాకు సర్టిఫికేట్ ​ఇవ్వనన్న సెన్సార్ బోర్డు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 09, 2018, 04:50 PM
 

సదా కీలక పాత్ర పోషించిన 'టార్చిలైట్' సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిరాకరించింది. వేశ్యావృత్తిలో నలిగిపోతున్న అమ్మాయిల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తన కెరీలోనే తొలిసారిగా సదా వేశ్య పాత్రను ఈ సినిమాలో పోషించింది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగిందనుకుంటే, తాజాగా సెన్సార్ ఇబ్బంది కూడా ఎదురైంది. కొన్ని వారాల క్రితమే ఈ చిత్రాన్ని సెన్సార్ కు పంపగా... అశ్లీలత మోతాదు మరీ ఎక్కువగా ఉందన్న కారణంతో సర్టిఫికేట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో దర్శక నిర్మాతలు ఢిల్లీలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించి... సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తో 'తమిళన్' సినిమాను తెరకెక్కించిన ఎ.మజీద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Recent Post