మ‌ణిక‌ర్ణిక రీ షూట్.. మ‌రో రూ అయిదు కోట్లు అవిరి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 09:47 AM
 

బాలీవుడ్ క్వీన్ కంగ‌నారానౌత్ ఝాన్సీ ల‌క్ష్మీ బాయి పాత్ర‌లో న‌టిస్తున్న మూవీ మ‌ణిక‌ర్ణిక‌. క్రిష్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుప‌కుంటున్న‌ది.. ఎడిటింగ్ టేబుల్ పైకి ఈ మూవీ వ‌చ్చిన త‌ర్వాత కొన్ని సీన్స్ పై క్రిష్ అసంతృప్తి చెందాడ‌ని టాక్.. దీంతో రీషూట్ చేయాల‌ని భావిస్తున్నాడు.. దీనికి రూ 5 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా. రీ షూట్ కు ఈ మూవీని నిర్మిస్తున్నా జి సినిమాను క్రిష్ ఒప్పించినట్లు స‌మాచారం.. దీంతో త్వ‌ర‌లోనే ఆ సీన్స్ ని తిరిగి చిత్రీక‌రించ‌నున్నారు.. ఆగ‌స్ట్ లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ది.
Recent Post