మూడేళ్ళు పూర్తి చేసుకున్న బాహుబ‌లి ది బిగినింగ్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 10:57 AM
 

తెలుగు సినిమా స‌త్తాని ప్ర‌పంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబ‌లి. రెండు పార్ట్‌లుగా విడుద‌లైన బాహుబ‌లి సిరీస్‌కి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంసలు ల‌భించాయి. తొలి పార్ట్ జూలై 10, 2015న విడుద‌లైంది. నేటితో ఈ చిత్రం మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. బాహుబ‌లి సినిమా ప్ర‌భాస్ రేంజ్ ని పూర్తిగా మార్చేసింది. హిందీ నిర్మాత‌ల నుండి ప్ర‌భాస్‌కి భారీ ఆఫర్స్ వ‌స్తున్నాయి. అయితే అద్భుత దృశ్యకావ్యంగా తెర‌కెక్కిన బాహుబ‌లి చిత్రం 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కగా, ఇందులో స‌న్నివేశాలు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచుకున్నాయి. చైనాలోను ఈ చిత్రం వ‌సూళ్ల సునామి సృష్టించిందంటే బాహుబ‌లి ప్ర‌భంజ‌నం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రంలో పని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. బాహుబ‌లి 2లో అమాయ‌కుడి పాత్ర పోషించిన సుబ్బ‌రాజుకి జ‌పాన్ ప్రేక్ష‌కులు ఇటీవ‌ల ఘ‌న స్వాగతం ప‌లికిన సంగ‌తి తెలిసిందే.


తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన బాహుబ‌లి చిత్రం పాఠ్యాంశంగా కూడా ప్ర‌చురిత‌మైంది. ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థుల మేనేజ్ మెంట్ సిలబస్ లో బాహుబలిని ఓ అంశంగా చేర్చిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్‌ బుక్స్‌, ఏనిమేషన్‌ సిరీస్‌, మర్చెంట్‌ డైస్‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌స్తుతం సుమారు రూ.350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రీక్వెల్‌ని కూడా తెర‌కెక్కించే ప్లాన్ చేశారు. రాజ‌మౌళి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దేవా క‌ట్టా ప్రీక్వెల్‌ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. బాహుబ‌లికి సీక్వెల్‌గా వ‌చ్చిన బాహుబ‌లి 2 చిత్రం 65వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌లో భాగంగా ఉత్తమ యాక్షన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకున్న విష‌యం విదిత‌మే
Recent Post