‘చి ల సౌ’ విడుదలకు ముహూర్తం ఖరారు

  Written by : Updated: Tue, Jul 10, 2018, 12:53 PM
 

దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్, సుశాంత్‌తో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదిని నిర్మాతలు ఖరారు చేశారు. జూలై 27వ తేదిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో సుశాంత్ సరసన రుహాని శర్మ నటించగా.. వెన్నెల కిశోర్, జయ ప్రకాశ్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. సిరుసి సినీ కార్పోరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించాడు. 
Recent Post