లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్న ప్రముఖ నటి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 01:15 PM
 

వరస విజయాలతో తమిళ , తెలుగు భాషల్లో టాప్ హీరోయిన్ గా దూసుకెళుతున్నారు నటి సమంత అక్కినేని. ఈ ఏడాది ఆమె నటించిన ‘రంగస్థలం , మహానటి , అభిమన్యుడ’ సినిమాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘ యు టర్న్’ చిత్రంలో నటిస్తుంది . ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది . ఇక ఇప్పుడు ఆమె తదుపరి చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం లో నటించనున్నారు.


సమంతకు అయన చెప్పిన స్టోరీ భాగా నచ్చడంతో ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆగష్టు లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని కైరోస్ కంటెంట్ సంస్థ నిర్మించనున్నది. బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న’మణికర్ణిక’ చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మిస్తుంది.
Recent Post