టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 01:20 PM
 

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కొత్త ట్రెండ్ న‌డుస్తుంది. స్టార్ హీరోలంద‌రు లుంగీలో క‌నిపించి అభిమానుల‌కి పెద్ద షాకే ఇస్తున్నారు . ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన కాట‌మ‌రాయ‌డు చిత్రంలో ప‌వ‌న్ లుంగీతో క‌నిపించ‌గా, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా, శ్రీమంతుడులో మ‌హేష్‌, రంగ‌స్థలంలో రామ్ చ‌ర‌ణ్‌, కృష్ణార్జున యుద్ధంలో నాని, భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్ త‌దిత‌రులు లుంగీ క‌ట్టి హ‌ల్ చ‌ల్ చేశారు. ఇక ఇప్పుడు ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం కోసం వ‌రుణ్ తేజ్‌, వెంక‌టేష్‌లు లుంగీలు క‌ట్టి స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నారు. 


విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో ఎఫ్‌2 ( ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) రూపొందుతుంది. అనీల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొంద‌నున్న‌ ఈ చిత్రం ఫుల్ హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. మూవీలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టించ‌నుండ‌గా, మెహ‌రీన్ పీర్జా మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తోడ‌ళ్ళుగా వెంకీ, వ‌రుణ్‌లు న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. రీసెంట్‌గా వ‌రుణ్ తేజ్ లుంగీ క‌ట్టుకొని ఉన్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, ఇప్పుడు లుంగీలో వెంకీ ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. లుంగీ ధ‌రించిన స్టార్ హీరోల సినిమాల‌న్ని హిట్ కావ‌డంతో, ఈ మూవీ కూడా త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు.శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మించ‌నున్న ఎఫ్ 2 చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.
Recent Post