ఆ హీరోయిన్‌ ముద్దులు పెట్టాలని గోల చేస్తున్న హీరోలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 01:24 PM
 

"మహానటి" చిత్రంతో మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈమెకు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టమని గోల చేస్తున్నారట. నిజానికి కీర్తికి ముద్దులు పెట్టడం ఇష్టం లేదు. కానీ, ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టాలన్న నిబంధన విధిస్తున్నారట. దీంతో ఏం చేయాలో తోచడం లేదని వాపోతోంది.చేయాలో తోచడం లేదని వాపోతోంది. 


 'మహానటి' చిత్రం తర్వాత ఈమె రేంజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ, కొందరు తనని ముద్దు సన్నివేశాలలో నటించమని అడుగుతున్నారనీ, అయితే అలాంటి సన్నివేశాలలో నటించనని గతంలో చాలాసార్లు చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదని కీర్తి సురేష్ వాపోతోంది. తనని ఇంతకుముందు ఎవరూ ఆవిధంగా అడగలేదనీ, ఇటీవలే అలా అడుగుతున్నారనీ, కానీ తను అలాంటి సన్నివేశాలు చేయనని తెగేసి చెబుతోంది. 
Recent Post