వారి బాట‌లోనే రితికా సింగ్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 02:17 PM
 

ఇప్పుడు తెలుగులో న‌టిస్తున్న హీరోయిన్స్ అంద‌రూ తెలుగు నేర్చుకుంటున్నారు. అంతే కాకుండా తెలుగులో డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు.  కీర్తిసురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైద‌రి అంద‌రూ డ‌బ్బింగ్ చెప్పుకున్న‌వారే. ఇప్పుడు వీరి బాట‌లో రితికా సింగ్ అడుగుపెట్టింది. వివ‌రాల్లోకెళ్తే.. ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ క‌లిసి న‌టిస్తున్న థ్రిల్ల‌ర్ `నీవెవ‌రో`. ఈ చిత్రంలో రితికా సింగ్ త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటోంద‌ట‌. ద‌ర్శ‌కుడు హ‌రికృష్ణ రితికా స్వంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటే బావుంటుంద‌ని భావించ‌డంతో త‌ను కూడా ఒప్పుకుంద‌ట‌. కోన వెంక‌ట్‌, ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Recent Post