వారిద్దరికీ కామన్ ఫ్రెండ్‌గా ఉంటూ పరిచయం చేసింది నేనే

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 03:10 PM
 

బాలీవుడ్, హాలీవుడ్  హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో పదేళ్లు చిన్నోడైన అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఆమెగాని, అతడుగాని ఇంతవరకు స్పందించలేదు. కానీ వాళ్ల తిరుగుళ్లు చూస్తున్న జనం మాత్రం ఇది ప్రేమజంటే అని చెప్పేస్తున్నారు. ఇటీవల ప్రియాంక నిక్‌ను ముంబయికి తీసుకొచ్చి తన తల్లికి పరిచయం చేయడంతో త్వరలోనే పెళ్లికానుందని వార్తలు వస్తున్నాయి.


కానీ అలాంటిదేమీ లేదన్నట్లు ప్రియాంక కుటుంబం చెబుతోంది. తాను విదేశీయుణ్ని అల్లుడిగా స్వీకరించనని ప్రియాంక తల్లి తెగేస్తోంది. దీంతో ప్రియాంక, నిక్ అసలు ప్రేమికులేనా అని జనానికి మళ్లీ డొటొస్తోంది. అయితే అది ప్రేమజంటేనని, వారిని కలిపింది తానేనని ప్రముఖ హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్ ఓ ఇంటర్య్వూలో తెలిపాడు. ‘ప్రియాంకతో  బేవాచ్ చిత్రంలో నటించాను. జుమాంజి చిత్రంలో నిక్‌తో నటించాను. వారిద్దరికీ కామన్ ఫ్రెండ్‌గా ఉంటూ పరిచయం చేసింది నేనే. వారిద్దరి సంతోషానికి కారణం నేనే. ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది.. ’ అని చెప్పారు. కాగా, తనకు విదేశీ అల్లుడొద్దు అంటున్న ప్రియాంక తల్లి కాస్త దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ‘అతణ్ని ఇప్పుడే కలిశాను. కానీ మంచోడో కాదో అప్పుడే ఎలా తెలుస్తుంది..’ అంటోంది
Recent Post