జుత్తు కత్తిరించుకున్న సోనాలి బింద్రే

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 03:29 PM
 

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న నటి సోనాలి బింద్రే తన జుత్తును కత్తిరించుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో పంచుకున్న సోనాలి.. తాను ఒంటరిని కాదంటూ వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.


‘‘నాకు ఇష్టమైన రచయిత ఇసాబెల్ అలెండే వ్యాఖ్యల ప్రకారం.. ‘‘మనలోని బలం బయటకు వచ్చే వరకు మనం ఎంత బలవంతులమో మనకే తెలీదు. దు:ఖం, యుద్ధం, అవసరం వచ్చినప్పుడు మనిషి ఎన్నో అద్భుతాలు చేయగలడు. జీవించాలనుకున్నప్పుడు ఓ మనిషికి ఉన్న సామర్థ్యం గొప్పది’’. గత కొన్ని రోజులుగా అందరి వద్ద నుంచి నేను పొందుతున్న ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. అలాగే కొంతమంది క్యాన్సర్‌ను జయించిన వారు తమ కథలను నాకు చెప్పి నన్ను ఉత్సాహపరుస్తున్నారు. వారి కథల వలన నాకు మరింత ధైర్యం పెరిగింది. అంతేకాదు నేను ఒంటరి కాదు అన్న ధైర్యం నాకు పెరిగింది. ఇప్పటి నుంచి ప్రతి రోజు నేను కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ పాజిటివ్ ఆలోచనలతో ఉండేందుకే ప్రయత్నిస్తాను. ఈ క్రమంలో నా ప్రయాణాన్ని కూడా మీతో పంచుకుంటాను’’ అంటూ ఓ పోస్ట్‌ను చేసింది సోనాలి. 
Recent Post