పాప్‌ సింగర్‌ జెన్నిఫ‌ర్ పాత్రలో ఆండ్రియా

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 04:18 PM
 

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఆయుష్మాన్‌ భవ. నేను లోక‌ల్ ఫేం త్రినాథ్ రావు న‌క్కిన కథ అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు మరో యువ దర్శకుడు మారుతి సహ నిర్మాతగా వ‍్యవహరిస్తున్నారు. సీనియర్ రచయిత పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండటం విశేషం. బాలీవుడ్‌ లో బేబీ డాళ్‌, హ్యాంగ్ ఓవర్‌, హైహీల్స్‌ లాంటి చిత్రాలకు సంగీతమందించిన బ్రోస్‌ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.


చరణ్‌ తేజ్‌ సరసన స్నేహా ఉల్లాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా అలరించనున్నారు. అది కూడా పాప్‌ సింగర్‌ జెన్నిఫర్‌ పాత్రలో ఆండ్రియా కనిపించనున్నారు. ప్రేమ పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన  దీర్ఝ ఆయుష్మాన్ భవ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వర‌లో జెన్నీఫర్‌గా ఆండ్రియా లుక్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Recent Post