తేజా, బెల్లంకొండ సినిమా ప్రారంభం

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 10, 2018, 04:58 PM
 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కనుండి. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభించారు. దర్శకులు వి.వి.వినాయక్‌, శ్రీవాస్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలి సన్నివేశానికి వినాయక్‌ క్లాప్‌ కొట్టారు. మాజీ మంత్రి దానం నాగేందర్‌ చిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.


కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా మొదలైందని నిర్మాత చెప్పారు. తొలి రోజు షూటింగ్‌లో సాయి శ్రీనివాస్‌, కాజల్‌, అభిమన్యు సింగ్‌ పాల్గొన్నారు. ఏకె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి భూపాల్‌ మాటలు రాస్తున్నారు.
Recent Post