థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 11, 2018, 11:28 AM
 

అందాల భామ హన్సిక సైతం ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది. నయనతార, అనుష్క, త్రిష వంటి అగ్రతారలు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథాచిత్రాలకు మారిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ హర్రర్‌ కథా చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఈ కోవలో హన్సిక చేరుతోంది. అవును ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంతో ఒక థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. కోలీవుడ్‌లో యువ స్టార్‌ హీరోలందరితోనూ నటించేసిన ఈ అమ్మడికి చిన్న గ్యాప్‌ వచ్చిన మాట నిజ మే అయితే ఇప్పు డు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు రెడీ అయిపోయింది. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు చిత్రాలను చేస్తున్న హన్సిక తాజాగా మరో చిత్రానికి ఓకే చేసింది. ఇదే థ్రిల్లర్‌ కథా చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించడం. దీన్ని జ్యోస్టర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఎం.కోటేశ్వర రాజు నిర్మించనున్నారు. విజయ్‌ రాజేంద్ర వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా  యుఆర్‌.జమీల్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


ఈయన మసాలా పడం, రోమియో జూలియట్, భోగన్‌ చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. రోమియో జూలియట్, భోగన్‌ చిత్రాల సమయంలో యుఆర్‌.జమీల్‌ పనితనం నటి హన్సికను ఆకర్షించిందట. అందుకే ఈయన దర్శకత్వంలో నటించమని అడగ్గానే ఓకే చెప్పాసిందట. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ పలు భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న జిబ్రాన్‌ తమ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం కలిగిన ఈ థ్రిల్లర్‌ కథా చిత్రానికి పనిచేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారన్నారు. కథ వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యి సంగీతాన్ని అందించడానికి సమ్మతించారని చెప్పారు.


ఇక నటి హన్సిక కథ వినగానే కథ వినగానే నటించడానికి సమ్మతించారని చెప్పారు.ఆమె నాయకిగా నటించడం, జిబ్రాన్‌ సంగీతాన్ని అందించడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. మరి కొందరు ప్రఖ్యాత సాంకేతిక నిపుణలను ఎంపిక చేసే చర్చల్లో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం అనగానే వాణిజ్య పరమైన అంశాలు అంతగా ఉండవని భావించవచ్చునని, అయితే తమ చిత్రంలో థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు జనరంజకమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని అన్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి విలువలతో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు యుఆర్‌.జమీల్‌ చెప్పారు.
Recent Post