చొక్కా లేకుండా బ‌స్ స్టాప్‌లో నిలుచొన్న విజ‌య్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 12:11 PM
 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌క్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ స్టేట‌స్ అందుకున్న ఈ కుర్ర హీరో ప్ర‌స్తుతం గీత గోవిందం, నోటా చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టించిన ట్యాక్సీవాలా చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ఈ కుర్ర హీరో రౌడీ క్ల‌బ్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో అంద‌రిని జాయిన్ కావాల‌ని కోరాడు. పేరు న‌మోదు చేసుకున్న వారిలో సెల‌క్ట్ అయిన ఓ వ్య‌క్తికి రౌడీ క్ల‌బ్ పేరుతో కాస్ట్యూమ్ ధ‌రింప‌జేసి రీసెంట్‌గా జ‌రిగిన ఫిలిం ఫేర్ ఈవెంట్‌కి తీసుకెళ్లి ఆయ‌న ప‌క్క‌నే కూర్చో పెట్టుకున్నాడు. ఆ వ్య‌క్తికి జీవితంలో గొప్ప అనుభూతిని అందించాడు.


అభిమానుల కోసం సొంత దుస్తుల బ్రాండ్‌ని ప్రారంభించ‌బోతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ దీనికి రౌడీ క్ల‌బ్ అనే పేరు పెట్టారు. దీనికి బాగానే ప్ర‌మోష‌న్ చేసుకుంటున్నాడు. తాజాగా త‌ను బ‌స్‌స్టాప్‌లో చొక్కా లేకుండా నిలుచొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ..బ‌స్ స్టాప్ వ‌ద్ద ఎదురు చూస్తున్నాను. ఇప్ప‌టికీ నాకు న‌చ్చిన చొక్కా దొర‌క‌లేదు. నేనూ మీ లాగే రౌడీ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సొంత దుస్తుల బ్రాండ్‌ ప్రారంభిస్తున్న సందర్భంగా జులై 15న సన్‌డౌనర్‌ పార్టీని నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
Recent Post