నయనతారను అభినందించిన సమంత

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 01:00 PM
 

తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకు విపరీతమైన క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లో సమంత కూడా అగ్రకథానాయికగా కొనసాగుతోంది. అలాంటి సమంత తాజాగా నయనతారను అభినందించడం ఆసక్తికరంగా మారింది. నయనతార తాజా చిత్రంగా తమిళంలో 'కొలమావు కోకిల' సినిమా నిర్మితమైంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, ఈ నెల 5వ తేదీన ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ ను 38 లక్షల మందికి పైగా చూశారు. ఈ ట్రైలర్ గురించి .. నయనతార నటన గురించే కోలీవుడ్లో అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ ట్రైలర్ గురించి సమంత స్పందిస్తూ .. "కొంచెం ఆలస్యంగా స్పందిస్తున్నానని తెలుసు .. ట్రైలర్ చాలా బాగుంది .. నయనతార నటన అద్భుతం .. ఆమె కీర్తి కిరీటంలో ఓ డైమండ్ స్టోన్ లా ఈ సినిమా నిలిచిపోతుందని అనిపిస్తోంది. ఈ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు" అంటూ ఆమె ట్వీట్ చేసింది. తన తోటి హీరోయిన్ ను సమంత ప్రశంసించడం ఆమె పెద్ద మనసుకు నిదర్శనమని అంతా మెచ్చుకుంటున్నారు.  
Recent Post