ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్‌గా మారిన అలియా సాంగ్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 01:14 PM
 

బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ త‌క్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తూ ప్రేక్ష‌కులకి చాలా ద‌గ్గ‌రైంది. ఈ మ‌ధ్య ర‌ణ్‌బీర్‌తో ప్రేమ‌యాణం న‌డిపిస్తూ మరింత వార్త‌ల‌లో నిలుస్తుంది. కొన్నాళ్ళుగా ర‌ణ్‌బీర్‌, అలియా భ‌ట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో వీరిరివురు పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నున్నార‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. రీసెంట్‌గా రణ్‌బీర్‌.. అలియా ఇంటికి వెళ్ళి డిన్న‌ర్ చేసి వ‌చ్చాడు. ఈ ఫోటోలు ఇంట‌ర‌నెట్‌లో ట్రెండీగా మారాయి. క‌ట్ చేస్తే ఇటు రణ్‌బీర్ అటు అలియా భ‌ట్ అభిమానులు సోషల్ సైట్స్ లో క్రేజీ క‌పుల్‌కి సంబంధించిన పాత‌ ఫోటోలు, వీడియోని వైర‌ల్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఈవెంట్‌లో ర‌ణ్‌బీర్ న‌టించిన యేదిల్ హై ముష్కిల్ సినిమాలోని టైటిల్ సాంగ్‌ని ఓ ఈవెంట్ లో స్టేజ్‌పై పాడి అల‌రించింది అలియా . క‌ర‌ణ్ జోహార్‌, మ‌నీష్ పాల్ కూడా అలియాకి స‌పోర్ట్ అందించారు. ప్ర‌స్తుతం అలియా పాడిన సాంగ్ వీడియో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మీరు ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
Recent Post