మోనాల్ గుజ్జ‌ర్ సేఫ్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 03:44 PM
 

బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, సుడిగాడు ఫేమ్ మోనాల్ గుజ్జర్ పెద్ద ప్ర‌మాదం నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.. తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబసభ్యులు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లింది.. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా తుక్కుతుక్కు అయ్యింది. కారు పరిస్థితి చూస్తే అందులో ఎవరూ బతికి బట్టలేదని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోనాల్ కూడా మృతిచెందినట్టు వార్తలు వచ్చాయి. దీంతో మోనాల్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను ఖండించారు. తనతో పాటు కుటుంబసభ్యులు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని.. అందుకే బెల్ట్ ధరించానని తెలిపింది
Recent Post