ఆరాధ్య‌తో ఐష్ ముద్దు

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 03:45 PM
 

బాలీవుడ్ బిగ్ బి  అమితాబ్ బ‌చ్చ‌న్ అత‌డి కుమారుడు అభిషేక్‌తో  క‌లిసి ర‌ష్యాలో ఉన్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్ త‌న కూతురితో పారిస్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అక్క‌డ డిస్నీలాండ్‌ని సంద‌ర్శించిన త‌ల్లి కూతుళ్లు ఓ అంద‌మైన ఫోటోకి ఫోజులిచ్చారు. ఒక‌రినొక‌రు ప్రేమ‌గా ముద్దుపెట్టుకుంటూ ఫోటో దిగారు. ఈ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఐష్‌. ఫ‌న్నేఖాన్ చిత్రంతో బిజీగా ఉన్నఐశ్వ‌ర్య‌రాయ్ లాంజీన్స్ అనే వాచ్ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేసే క్రమంలో షూటింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లింది. ఆరేళ్ళ కూతురిని కూడా త‌న‌తో తీసుకెళ్లిన అందాల సుంద‌రి, గుడ్ టైంని హ్యాపీగా గడుపుతుంది. కూతురికి సంబంధించిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ ఫ్యాన్స్‌కి మాంచి మ‌జా అందిస్తుంది.
Recent Post