విజ‌య్ స‌ర‌స‌న కాజ‌ల్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 03:48 PM
 

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి హిట్స్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ కమిటైన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించే సినిమా కూడా ఉందని తెలిసింది. ఈ చిత్రాన్ని కె.ఎస్‌రామారావు నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. చిత్ర కథనం ప్రకారం కొత్తగూడెం కోల్‌మైన్స్‌లో షూటింగ్‌ చేస్తారని తెలిసింది. విజయ్‌ దేవరకొండ వైవిథ్యమైన పాత్రలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా కాజల్‌ను ఎంపికచేస్తున్నట్టు తెలిసింది. ఇటీవల కుర్ర హీరోలతో నటించేందుకు కాజల్‌ సై అంటోంది. దానికి తగినట్టుగానే ఆమెకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇప్పటికే రానా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సినిమాలు చేస్తోంది. తాజాగా విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో నటిస్తూ యువ ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది.
Recent Post