ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మమ్మ అయ్యాను

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 13, 2018, 11:01 AM



హాట్‌ నటి లక్ష్మీరాయ్‌ అమ్మమ్మ అయిందట. ఇది నిజంగా హాట్‌ న్యూస్‌. ఇంకా పెళ్ళికాని లక్ష్మీరాయ్‌ అమ్మమ్మ కావడం అంటే ఆశ్చర్యం కలిగించే వార్త. పైగా నేను అమ్మమ్మను అయ్యాను అంటూ ఆమె స్వయంగా ట్వీట్‌ చేశారు. ఇప్పటి నుండి తన కుటుంబం పెద్దది అయిందని కూడా ఆమె పేర్కొన్నారు. లక్ష్మీరాయ్‌ అమ్మమ్మ కావడం వెనుక ఆసక్తి విషయం ఉంది. తన పెంపుడు కుక్కను సొంత బిడ్డలాగా చూసుకుంటుంద. ఇప్పుడు ఆ కుక్కకి రెండు పిల్లలు పుట్టాయి. దాంతో లక్ష్మీరాయ్‌ తెగ ఆనందపడింది. నా వయసువున్న వాళ్ళు అమ్మలు అవుతున్నారు. నేను మాత్రం కుక్కపిల్లలను అమ్మమ్మను అయ్యాను అంటూ సంబరపడింది. వాటిని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలను ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇదీ అసలు విషయం. ఆమెకున్న జంతు ప్రేమను అభినందించాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com