డేట్ ఫిక్స్ చేసుకున్న చై, సామ్ మూవీ

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 19, 2018, 02:30 PM
 

పెళ్లి తర్వాత మొదటిసారిగా అక్కినేని నాగచైతన్య, సమంత ఓ సినిమాలో కలిసి నటించనున్న విషయం తెలిసిందే. ‘నిన్ను కోరి’ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా ఈ నెల 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాను సాహు గరపతి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.


ఈ సినిమాలో రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణ మురళి, శత్రు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది చై, సామ్ కాంబినేషన్‌‌లో తెరకెక్కనున్న నాల్గవ సినిమా కావడం విశేషం. వీరి పెళ్లి తర్వాత తెరకెక్కుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
Recent Post