ట్రెండింగ్
Epaper    English

రూ. 700కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో దుమ్ము రేపుతున్న పుష్ప 2

cinema |  Suryaa Desk  | Published : Sat, May 14, 2022, 07:22 PMటాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల నేపథ్యంలో ఈ సినిమా జరుగుతుంది. అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది చివరిలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి నుండి ఈ సినిమాను కేజీఎఫ్ తో పోలుస్తూ రావటం వల్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసారు సుకుమార్. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమాకు హిందీలో మాత్రం అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎటువంటి ప్రొమోషన్ కార్యక్రమాలను హిందీలో చేయకున్నా రూ. 100 కోట్ల మార్కుతో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమాలో బన్నీ బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.


దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. మరీ ముఖ్యంగా సమంత చేసిన ఊ అంటావా... సాంగ్ బాగా పాపులర్ అయింది. భీకరమైన యాక్షన్ అడ్వెంచరస్ కథతో పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమా విజయంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ పై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక వార్త ఈ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తుంది. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందట. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రూ. 200 కోట్లు, నార్త్ బెల్ట్ లో రూ. 200 కోట్లు, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రూ. 300 కోట్ల రేంజులో ఉండనున్నాయని అంచనా. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఇంత భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించటం ఖాయం. జూలైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com