ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవై సరళ ప్రధాన పాత్రలో సెంబి మూవీ.. టైటిల్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 04:23 PM



సౌత్ సినీ ఇండస్ట్రీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో కోవై సరళ ఒకరు. సపోర్టింగ్ ఆర్టిస్టుగా, లేడీ కమెడియన్ గా కోవై సరళ ఎన్నో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించారు. తన ఫన్ యాక్టింగ్ తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీ తో కోవై సరళ ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. తాజాగా కోవై సరళ తమిళంలో ఒక సినిమాలో ఆసక్తికరమైన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రనిర్మాతలు విడుదల చేసారు. ఈ పోస్టర్లో కోవై సరళ డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సెంబి అనే టైటిల్ ను ఖరారు చేసారు. డీ గ్లామర్ పాత్ర కోసం కోవై సరళ భారీగానే మేకోవరైనట్టు క్లియర్ గా కనబడుతుంది. 


దగ్గుబాటి రానా నటించిన అరణ్య సినిమాను డైరెక్ట్ చేసిన ప్రభు సోలమన్ సెంబి చిత్రానికి దర్శకత్వం చేస్తున్నారు. అశ్విన్ కుమార్, కోమలి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెంబి చిత్రంలో కోవై సరళ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. డెబ్బై ఏళ్లకు పై బడిన ఒక సీరియస్ పాత్రలో సరళ ఈ సినిమాలో నటిస్తుంది. కొడైకెనాల్ నుండి దుండిగల్ వరకు జరిగే ఒక బస్సు ప్రయాణం, అందులో భాగంగా ఎదురయ్యే విభిన్నమైన ప్రయాణికుల కథతో ఈ సినిమా సాగుతుంది. తెలుగులో కూడా సెంబి పేరుతోనే విడుదలవబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com