ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆల్ యంగ్ యాక్టర్స్ తో 'సాఫ్ట్ వేర్ బ్లూస్' మూవీ... కేటీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 04:33 PMసాఫ్ట్ వేర్ బ్లూస్ అనే చిత్రంతో టాలీవుడ్ పరిశ్రమకు పలువురు కొత్త నటీనటులు పరిచయమవబోతున్నారు. ఉమా శంకర్ డైరెక్షన్లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ నిర్మించింది. సుభాష్ ఆనంద్ సంగీతమందించారు. వంశీకృష్ణ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందిస్తున్నారు.  ఈ చిత్రంతో శ్రీరామ్ నిమ్మల అనే యువ హీరో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భావనా అనే కొత్తమ్మాయి హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల చేసారు. సాఫ్ట్ వేర్ బ్లూస్ టైటిల్ కు తగ్గట్టుగానే, సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సంపాదించడంలో యువత ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటుందో, ఆ జాబ్ లో ఎంతటి ఒత్తిడి ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో జూన్ 24న ఈ చిత్రం విడుదల కానుంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com